ఆలోచనలు అనేవి గొలుసు కట్టు. ఎప్పుడూ ఆగవు. ఎప్పుడూ మాట వినవు. వొద్దు అంటే అక్కడే ఉండేవి, పోని కావాలి అంటే అక్కడనుంచి పరుగు పెట్టేవి, ఆలోచనలే.ఎప్పడూ ఆగకుండా వొచ్చే ఈ ఆలోచనలకి లహరి అన్న పేరు సబబు అనిపించింది.
దీనికి మంచి ఉదాహరణ ఏమిటంటే…
ఒక వితండవాది ఒక గురువు గారి దగ్గరికెళ్ళి, నాకు దేవుడిని చూపించు అన్నాడట. దానికి గురువుగారు - నాయినా, నీకు దేవుడి సాక్షాత్కారం, ఒకటి నుంచి పది అంకెలు లెక్క పెట్టు నీకు దేవుడు పత్యక్షం అవుతాడు, కాని ఆ లెక్క పెట్టె సమయంలో మాత్రం నీకు కోతి గుర్తుకురాకూడదు అన్నారట.వితండవాది ఎప్పుడు ప్రయత్నించినా ముందర కోతే గుర్తుకువోచ్చేది. మన మనస్సు, ఆలోచనలు ఎప్పుడు అలాగే ఉంటాయి. కాదంటే ఔననిలే!!
Sunday, June 8, 2008
Subscribe to:
Posts (Atom)